Monday, 23 June 2014

అన్ని దానాలలో కెల్లా ప్రాణ దాన స్వరూపం ఈ రక్తం (రుధిరం)
పునర్జన్మను ప్రసాదించే బిందువు ఈ రక్తం (రుధిరం)
రంగు కలిగి ఉంటుంది కాని రంగులు మార్చే గుణం లేనిది 
సామాన్యుడిలోనైనా ,ధనికుడిలోనైనా ఒకేలాగా ప్రవహిస్తుంది 
మతమంటూ తెలియదు దీనికి .. ఏ జాతిలోనైన దీనికి ఉన్నది ఒకే నీతి 
కులమంటూ ఉండదు దీనికి .. ఎటువంటి కుళ్ళు లేని అమృత మిది
సకల మానవాళికి ఇది అవసరం .. ప్రపంచం మొత్తం ఓ రక్త సమీరం 
ఏ రక్తం ఏ సమూహం దో  చెప్పవచ్చు కాని 
ఏ రక్తం ఎవ్వరిదో అనేది ఎవరూ చెప్పలేరు 
మనిషి అందానికి మూలం ఈ రక్తం (రుధిరం)
మనిషి కదలిక కు ఊపిరి ఈ రక్తం (రుధిరం)
మన  గుండె చప్పుడికి ప్రాణం ఈ రక్తం (రుధిరం)  
మన ఒంట్లో రక్తం ఉన్నన్నాళ్ళే  మనకు జీవన గమనం 
అది కాస్త పోయిందా మనకు మరణం తధ్యం 
నీకు ఎంత అవసరమో అది అందరికీ అంతే అవసరం 
ఆస్తి లాంటిది కాదు ఇది , డబ్బు లాంటిది కానే కాదు 
ఏ ప్రాంత తత్వమూ లేని ఘన పదార్ధం ఇది 
దీని విలువ తెలిసిన వారు కొందరుంటే .. తెలియని వారు ఇంకెందరో