అన్ని దానాలలో కెల్లా ప్రాణ దాన స్వరూపం ఈ రక్తం (రుధిరం)
పునర్జన్మను ప్రసాదించే బిందువు ఈ రక్తం (రుధిరం)
రంగు కలిగి ఉంటుంది కాని రంగులు మార్చే గుణం లేనిది
సామాన్యుడిలోనైనా ,ధనికుడిలోనైనా ఒకేలాగా ప్రవహిస్తుంది
మతమంటూ తెలియదు దీనికి .. ఏ జాతిలోనైన దీనికి ఉన్నది ఒకే నీతి
కులమంటూ ఉండదు దీనికి .. ఎటువంటి కుళ్ళు లేని అమృత మిది
సకల మానవాళికి ఇది అవసరం .. ప్రపంచం మొత్తం ఓ రక్త సమీరం
ఏ రక్తం ఏ సమూహం దో చెప్పవచ్చు కాని
ఏ రక్తం ఎవ్వరిదో అనేది ఎవరూ చెప్పలేరు
మనిషి అందానికి మూలం ఈ రక్తం (రుధిరం)
మనిషి కదలిక కు ఊపిరి ఈ రక్తం (రుధిరం)
మన గుండె చప్పుడికి ప్రాణం ఈ రక్తం (రుధిరం)
మన ఒంట్లో రక్తం ఉన్నన్నాళ్ళే మనకు జీవన గమనం
అది కాస్త పోయిందా మనకు మరణం తధ్యం
నీకు ఎంత అవసరమో అది అందరికీ అంతే అవసరం
ఆస్తి లాంటిది కాదు ఇది , డబ్బు లాంటిది కానే కాదు
ఏ ప్రాంత తత్వమూ లేని ఘన పదార్ధం ఇది
దీని విలువ తెలిసిన వారు కొందరుంటే .. తెలియని వారు ఇంకెందరో

No comments:
Post a Comment